ఓటమి భయంతోనే ధర్మవరంలో దాడులు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు దుర్మార్గం.. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోరాటం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు చేయడం దుర్మార్గమని ఖండించారు.

కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, మున్సిపల్ ఎన్నికల్లో పరాభవం తప్పదనే ఉద్దేశంతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ప్రశాంతంగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడిన కూటమి నాయకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Back to Top