గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మహిళల మృతిపై వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మహిళలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

Back to Top