నంద్యాల: నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈర్ణపాడు గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకుడు గోపాల్రెడ్డి భార్యను శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో ఓ దుండగుడు ఆమెపై దాడి చేసి, మెడలోని బంగారు గొలుసును అపహరించడంతో ఆమె గాయపడినట్లు తెలుసుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.