వెన్నుపోటు పార్టీకి దమ్ముంటే.. రేపల్లెలో సొంత పార్టీ నేతనే బరిలోకి దించాలి

వలస వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను దించకుండా గెలవగలరా?

పీట నాగమోహనకృష్ణ సవాల్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్‌ పీట నాగమోహనకృష్ణ.

రేపల్లెలో వైయ‌స్సార్‌సీపీ అంటే వెన్నుపోటు పార్టీకి భయం

పేరుకే మంత్రి సత్యప్రసాద్‌. ఆయన చెప్పేవన్నీ అసత్యాలే

రేపల్లెలో పేకాట, మట్టి, గ్రావెల్, మద్యం మాఫియా

వీటన్నింటిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?

మంత్రి సత్యప్రసాద్‌ను నిలదీసిన పీట నాగమోహనకృష్ణ

తాడేపల్లి: రేపల్లెలో వెన్నుపోటు పార్టీకి తమ భయం పట్టుకుందని రేపల్లె నియోజకవర్గం వైయస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ పీట నాగమోహనకృష్ణ  ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసులు, అరెస్టులతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు దమ్ముంటే, రేపల్లెలో వైఎస్సార్‌సీపీ నుంచి వలస వచ్చిన నేతల నుంచి కాకుండా, సొంత పార్టీ నేతను బరిలోకి దించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పీట నాగమోహనకృష్ణ సవాల్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో పీట నాగమోహనకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:

పేరుకే సత్య ప్రసాద్‌.. మాట్లాడేవన్నీ అసత్యాలే:
    మంత్రి సత్యప్రసాద్‌ పేరు సత్యప్రసాద్‌ అయినా.. ఆయన మాట్లాడేవన్నీ అసత్యాలే. నీచ  రాజకీయాలకు పేటెంట్‌ వెన్నుపోటు పార్టీకి ఉంది. అలాంటి పార్టీలో ఉంటూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రతిసారీ రాజకీయ డైవర్షన్‌ కోసం తెరపైకి తెస్తున్నారు. హత్య కేసులోని నిందితుల విషయంలో అధికార పక్ష నేతల వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వాన్ని, పాత కేసులను ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 
    డీఎస్సీ వ్యవహారంలో విద్యార్థులు, వైయ‌స్సార్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువతకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం. డీఎస్సీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో రాష్ట్ర యువత గమనిస్తోంది. సచివాలయ ఉద్యోగులను అవమానించడం సరికాదు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగితే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని అవమానించేలా మాట్లాడటం బాధాకరం. ఉద్యోగులు తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్నారు.  వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందే. 

రేపల్లెలో మట్టి, పేకాట మాఫియాలపై ఏం సమాధానం చెబుతారు:
    రేపల్లె నియోజకవర్గంలో పేకాట, కోడి పందాలు, మట్టి అక్రమ రవాణా, రేషన్‌ అక్రమాలు, సెటిల్‌మెంట్లపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలి.  నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై వైఎస్సార్‌సీపీ ఆధారాలతో ప్రజల ముందుకు వస్తుంది. శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో రేపల్లె ప్రజలకు తెలుసు. గత ఎన్నికల్లో వివిధ ఘటనలను రాజకీయంగా మంత్రి సత్యప్రసాద్‌ ఉపయోగించుకున్నారు. 
    రేపల్లె నియోజకవర్గంలో 22ఏ, అసైన్డ్‌ భూములకు సంబంధించిన వ్యవహారాలపై త్వరలో మరిన్ని ఆధారాలను ప్రజల ముందుంచుతాం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతుండటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేపల్లెలో పేకాట వ్యవహారంపై గతంలోనే వీడియో ఆధారాలను బయటపెట్టామని, మరిన్ని వివరాలను కూడా ప్రజల ముందుంచుతామని పీట నాగమోహనకృష్ణ తెలిపారు.

Back to Top