రీసర్వే ముసుగులో 350 ఎకరాల కబ్జాకు టీడీపీ ప్లాన్‌ 

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఫైర్‌

ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ కబ్జా ఆపాలి

లేని పక్షంలో న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ హెచ్చరిక

పామర్రు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల లంక భూముల కబ్జాపై స్థానిక రైతులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసిన తర్వాత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

పామర్రులో రీసర్వే పేరుతో భారీ కబ్జాకు యత్నం

ఫోర్జరీ పత్రాలతో 350 ఎకరాలు కొట్టేస్తున్న టీడీపీ 

ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా కన్నుసన్నల్లో కబ్జా

రికార్డుల్లో లేని పేర్లతో పాస్‌ పుస్తకాల జారీ

రెండున్నరేళ్లలో పామర్రులో 300 కోట్ల సంపద దోపిడీ 

ఇసుక, మట్టి, భూములు వేటినీ వదల్లేదు

ఇప్పుడు ఎస్సీ సొసైటీ భూముల స్వాధీనం

ప్రభుత్వ భూములుగా చూపించి ఇసుక తవ్వకాలు

ప్రెస్‌మీట్‌లో కైలే అనిల్‌కుమార్‌ ఆక్షేపణ

తాడేపల్లి: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఎస్సీ సొసైటీకి చెందిన 350 ఎకరాల లంక భూముల్ని స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా లాక్కుని, ప్రభుత్వ భూములుగా చూపించి ఇసుక తవ్వకాలకు ప్రయత్నించడంపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కైలే అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. బాధిత ఎస్సీ రైతులతో కలిసి, వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు.
    ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోకపోతే న్యాయస్దానాల్ని ఆశ్రయిస్తామని, అప్పటికీ న్యాయం జరగకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం రాగానే అక్రమంగా జారీ చేసిన పాస్‌ పుస్తకాలు రద్దు చేసి, విచారణ చేయిస్తామని, జగన్‌గారు రైతులకు హామీ ఇచ్చారని కైలే అనిల్‌ వెల్లడించారు. 
ప్రెస్‌ మీట్లో కైలే అనిల్‌ కుమార్‌ ఇంకేమన్నారంటే..:
    
పామర్రులో వెన్నుపోటు పార్టీ భారీ భూకబ్జా:
    పామర్రులో రీసర్వే పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి 350 ఎకరాలు వెన్నుపోటు పార్టీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్లాన్‌ చేశారు. గ్రామంలో 1200 ఎకరాల భూమి ఉంటే రెగ్యులర్‌ గా సాగు చేసుకునే రైతులు 250 ఎకరాల్లో ఉన్నారు. వారికి పాస్‌ పుస్తకాలు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మరో 350 ఎకరాలు రికార్డుల్లో లేని వారి పేర్లు సృష్టించి, గంటా సురేష్‌ అనే స్థానిక మాఫియా నాయకుడి పర్యవేక్షణలో, ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా దర్శకత్వంలో స్థానిక ఎమ్మార్వో భూములు అప్పగించారు. ఈ గంటా సురేష్‌ అనే వ్యక్తి స్థానికంగా ఇసుక మాఫియా నడుపుతున్నాడు. ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. అతని కుటుంబానికి 30 ఎకరాలు ఇచ్చేశారు. కృష్ణ చైతన్య అనే మానసిక స్థితి సరిగా లేని వ్యక్తికి నీకు 2 ఎకరాలు మాత్రమే ఉన్నాయని చెప్పి అతని 21 ఎకరాలు కొట్టేసి ఇతరులకు ఇచ్చేశారు. కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. 

చర్యలు తీసుకోకుండా న్యాయపోరాటం తప్పదు:
    వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలో 20 వేల ఎకరాలకు లీజు పట్టాలు ఇచ్చిన ఘనత ఉంది. ఇప్పుడు 600 ఎకరాలు ప్రభుత్వ భూమిగా చూపించి అందులో 100 ఎకరాలు రైతుల దగ్గరి నుంచి లాక్కుని ఇసుక తవ్వుకోవడం కోసం లీజుకు టెండర్‌ పిలిచారు. రెండు విధాలుగా వీళ్లు స్కాం చేస్తున్నారు. 350 ఎకరాలు పట్టా భూముల పేరుతో కొందరు రైతులకు అప్పగించి, వారి పేరుతో అనుమతులకు దరఖాస్తు చేసుకుని ఇసుక తవ్వుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటిదే 600 ఎకరాలు ఎస్సీ సొసైటీ నుంచి తీసేసుకుని, దాన్ని ప్రభుత్వ భూమిగా చూపించి, అందులోనూ ఇసుక తోలే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో దాదాపు 300 కోట్ల ప్రభుత్వ సొమ్ము కొట్టేసేందుకు  ప్రయత్నించారు. ఇదే విషయం జగన్మోహన్‌ రెడ్డి గారికి వివరించాం. ఈ ఎస్సీ సొసైటీ సభ్యులు జమీందారు గారి నుంచి కొనుక్కున్నట్లు అన్ని ఆధారాలు, పత్రాలు ఉన్నాయి. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా, ప్రభుత్వానికి వెళ్లాల్సిన డబ్బులు అక్రమార్కులు కొల్లగొట్టకుండా మేం ప్రయత్నిస్తున్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే 300 కోట్ల కొల్లగొట్టేందుకు అక్రమంగా ఇచ్చిన పట్టాదారు పుస్తకాలపై న్యాయస్దానాల్ని ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే మనం అధికారంలోకి రాగానే ఆ పట్టాదారు పాస్‌ పుస్తకాలన్నీ రద్దు చేసి, ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేయిద్దామని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు చెప్పారు. దీనిపై రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని కైలే అనిల్‌ కుమార్‌ తెలిపారు. 
 

Back to Top