ముదునూరి రామరాజు కుటుంబ స‌భ్యుల‌కు ప‌రామ‌ర్శ‌ 

 ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళికృష్ణరాజు తండ్రి ముదునూరి రామరాజు మృతి పట్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి వడ్డీ రఘురామ్‌ నాయుడు సంతాపం తెలిపారు. రామరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం రామరాజు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మురళికృష్ణరాజు, సీతారామరాజుతో పాటు కుటుంబ సభ్యులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top