రాప్తాడులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు.. పోలీసుల ప్రేక్షక పాత్ర

శ్రీ సత్యసాయి జిల్లా:  రాప్తాడు నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు చుట్టుముట్టారని, నామినేషన్లు వేసేందుకు వస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద కొందరు టీడీపీ వర్గీయులు ఆయుధాలతో సంచరిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అభ్యర్థులపై దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు భద్రత కల్పించి, ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.

Back to Top