విశాఖపట్నం: తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో విశాఖ నగర మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కేఆర్‌ఎం కాలనీలో 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మొల్లి లక్ష్మితో కలిసి ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. అలాగే ఆరిలోవలో 16వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సత్యాల సాగరికతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.