పుట్లూరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అడ్డంకులు

అనంతపురం: శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడటంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎన్నికల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.

Back to Top