వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన జగ్గంపేట నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన సూర్యచంద్ర, శ్రీదేవి, ముఖ్య అనుచరులు

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి, వారి ముఖ్య అనుచరులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పాఠంశెట్టి సూర్యచంద్ర గతంలో మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహంతో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top