వైయ‌స్ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబం

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన లక్ష్మీదేవి.

కూటమి పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయి

ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో పార్టీ మారానన్న గుండ లక్ష్మీదేవి

మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రజలను మోసగించారు

అందుకే స్థానిక ఎన్నికలంటే భయపడుతున్నారు

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఫైర్‌

రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదు

చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి

సక్రమంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో చంద్రబాబు

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పందించే ధైర్యం ఆ పార్టీలో ఎవరికీ లేదు

తమ పాలన చూసి ఓటెయ్యమని ప్రజలను అడిగే ధైర్యం చంద్రబాబుకి లేదు

అక్రమాలు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం అవివేకం

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు ధ్వజం

తాడేపల్లి:  శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో. తన అనుచరులతో కలిసి లక్ష్మీదేవి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్వయంగా కండువా కప్పిన శ్రీ వైయస్‌ జగన్, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిక తర్వాత గుండ లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఆమెతో పాటు, ధర్మాన సోదరులు కూడా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గుండ లక్ష్మీదేవి ఏమన్నారంటే..:

టీడీపీలో మంచి కార్యక్రమాలు కరువయ్యాయి:
    మేము ఏ పార్టీలో ఉన్నా ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పని చేశాం. కానీ నేడు టీడీపీలో మంచి కార్యక్రమాలు కరువయ్యాయి. రైతన్నలకు కనీసం యూరియా దొరకట్లేదు. ఆస్పత్రుల్లో మందులు కూడా లేని దుస్థితి నెలకొంది. ప్రజలకు మంచి చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే మేము వైఎస్సార్‌సీపీలో చేరడం జరిగింది. గతంలో మా కుటుంబం ఎలాగైతే నిబద్ధతతో పని చేసిందో, ఇకపై కూడా అదే అంకితభావంతో వైఎస్సార్‌సీపీ  బలోపేతానికి, ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తాం. 

లక్ష్మీదేవి చేరిక సంతోషకరం
:ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎం

– గుండ కుటుంబం తెలుగుదేశం పార్టీలో నాలుగు దశాబ్దాలు వివిధ పదవుల్లో పని చేసింది. అలాంటి నాయకులు ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీలో చేరడం శుభపరిణామం. ప్రజలకు మేలు చేయాలనే సత్సంకల్పంతో, వైఎస్‌ జగన్‌ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు ఆమె పార్టీలో చేరడం సంతోషకరం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదు.  ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని, అనంతరం కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలను మోసగించే విధానాలను వ్యతిరేకించే క్రమంలోనే గుండ లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రజలకు ఏది చెబితే అది ఆచరణలో చూపించిన నాయకుడు వైఎస్‌ జగన్‌.  . ఆయన నాయకత్వంలో ప్రజలకు మరింత సేవ చేసేందుకు లక్ష్మీదేవి ముందుకు రావడం పార్టీకి బలాన్నిస్తుంది. 

రాజ్యాంగ సంస్థలను స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదు
:ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి

– దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ సంస్థలు స్వేచ్ఛగా పని చేయకుండా అడ్డుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల పనితీరులో జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోంది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో తెలియజేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులకు అవసరమైన పోలీసు సహకారం అందించాలని, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఎన్నికల హామీలు అమలులో విఫలమై దౌర్జన్యాలు:
    సమర్థవంతమైన పాలన అంటే ప్రజలను మోసం చేయడమా? రాజ్యాంగ సంస్థలను స్వేచ్ఛగా పని చేయనివ్వకపోవడమా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు స్వేచ్ఛాయుత ఎన్నికలను కూడా నిర్వహించలేని పరిస్థితికి  చేరుకుంది. రైతులకు యూరియా అందడం లేదు, విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన కుప్పకూలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నా పట్టించుకోకుండా, అనుకూల మీడియా ద్వారా గొప్ప పాలన సాగుతోందని ప్రచారం చేసుకుంటే వాస్తవాలు మారవు. 
    డబ్బు, అధికార బలం, పోలీసు వ్యవస్థ ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయాలనే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరు. సుప్రీంకోర్టు జోక్యాన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు న్యాయస్థానాలు అవసరమైనప్పుడు జోక్యం చేసుకోవాలని, ఎన్నికల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవ్యవస్థను కోరుతున్నాం. ఇకనైనా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని.. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు.

Back to Top