గంగాధర నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు హౌస్‌ అరెస్ట్‌

నారాయణస్వామి, కృపాలక్ష్మిని ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు

చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కార్వేటినగరం మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా కూటమి నాయకులు అడ్డుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో కలిసి నామినేషన్లు వేయించేందుకు సిద్ధమైన నారాయణస్వామి, కృపాలక్ష్మిని పుత్తూరులోని వారి నివాసాల వద్ద పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.

Back to Top