పలమనేరులో టీడీపీ నేత బెదిరింపులు

ప్రచారం చేస్తే కాళ్లు చేతులు విరిచేస్తానంటూ హెచ్చరిక 

చిత్తూరు జిల్లా: పలమనేరు మున్సిపాలిటీలోని 17వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి రూపేష్‌ రాయల్‌ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సోమశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి బెదిరించినట్లు సమాచారం. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ప్రచారం చేయవద్దని, చేస్తే కాళ్లు చేతులు విరిచేస్తానంటూ హెచ్చరించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా చెప్పుతో కొడతానంటూ దూషించినట్లు తెలిపాడు.

వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిస్తే సోమశేఖర్‌రెడ్డికి చెందిన స్వీట్స్‌, బేకరీ వ్యాపారాలను అడ్డుకుంటానని, దుకాణాన్ని ధ్వంసం చేస్తానని బెదిరించినట్లు సమాచారం. రాజకీయంగా మద్దతు తెలిపే హక్కును భయపెట్టి అడ్డుకోవడం, వ్యాపారాలపై బెదిరింపులకు దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Back to Top