జలదంకిలో టీడీపీకి షాక్‌

వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన 70 కుటుంబాలు

ఉద‌య‌గిరి: జలదంకి మండలంలో టీడీపీకి చెందిన పూనూరు రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. టీడీపీ విధానాలు నచ్చక, సంక్షేమ పాలన వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యమని భావించి శుక్రవారం రామకృష్ణారెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో 70 కుటుంబాలు పార్టీలో చేరాయి.

పార్టీలో చేరిన వారికి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top