వేంపల్లి. వైయస్సార్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవలేమనే భయంతోనే చంద్రబాబు, లోకేశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా పులివెందులలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల ప్రక్రియకు దూరం చేసేందుకు నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అడుగడుగునా కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, ఆస్తులపై దాడులతో ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోని పోలీసులు అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ రాజకీయ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతును అడ్డుకోలేరని, ఓటు హక్కును కాలరాయాలని చూసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేదా?: ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల దగ్గరకు వెళ్లి వారి మన్ననలు పొందాలి. క్రికెట్ మ్యాచ్‌లో గెలవాలంటే ఆటగాళ్లు ప్రతిభ నిరూపించుకోవాలి. రాజకీయాల్లోనూ ప్రజాసేవ ద్వారా ప్రజల విశ్వాసం పొందాలి. కానీ చంద్రబాబు, లోకేష్ బృందానికి ఆ ధైర్యం లేదు. అందుకే పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను, ఎన్నికల సంఘాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అంపైర్లను తమవైపు తిప్పుకుని మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారు: పులివెందులలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కార్యకర్తలపై 307 సెక్షన్ కేసులు పెట్టడం, పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకుండా నిర్బంధించడం జరుగుతోంది. పులివెందులలోనే పుట్టి పెరిగిన నాకు అక్కడికి వెళ్లవద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి బయటి వ్యక్తులు వస్తుంటే వారిని స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ, ఆస్తులపై దాడులు చేస్తున్నారు. దాడులు చేసిన వారిపై కేసులేవి?: మా కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన లారీలు, మోటార్ సైకిళ్లను తగలబెట్టినా నిందితులపై కేసులు నమోదు చేయడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం అనేక కేసులు పెడుతున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణం. ప్రజలు ఈ ద్వంద్వ వైఖరిని గమనిస్తున్నారు. పోలీసులకు ప్యాకేజీల వ్యవహారంపై విచారణ జరపాలి: పులివెందులలో దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. వైయస్‌ఆర్‌సీపీ ఓటర్లను అడ్డుకోవడానికి, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గుండాలకు రక్షణ కల్పించడానికి ఈ బలగాలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. డీఎస్పీకి రూ.25 లక్షలు, సీఐకి రూ.10 లక్షలు, ఎస్‌ఐకి రూ.5 లక్షల చొప్పున ప్యాకేజీలు ఇచ్చారనే సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: పులివెందులలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు రాక్షసత్వాన్ని తలపిస్తోంది. తమ హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న ఈ వ్యవహారాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు పులివెందులలో జరుగుతున్న దాడులు రేపు మీ ప్రాంతాల్లోనూ జరగవచ్చు. ప్రజలు భయపడకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను ప్రజలంతా అడ్డుకుని, ఓటు అనే ఆయుధంతో తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి కోరారు.