విద్యా మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలి

వైయస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు
న్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం 

పదవ తరగతి విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లో ఛైన్‌ రంపంతో దాడి 

పాఠశాలల్లోనూ విద్యార్థులకు కొరవడిన రక్షణ

:రాప్తాడు ఘటనపై వైయస్సార్‌సీపీ నాయకుల ఫైర్‌ 

 తాడేపల్లి:     అనంతపురం జిల్లా రాప్తాడులోని జడ్పీ హైస్కూల్‌లో క్లాస్‌రూమ్‌లోనే పదవ తరగతి విద్యార్థినిపై ఛెయిన్‌ రంపంతో దాడి, రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలకు, యథేచ్ఛగా అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి నిదర్శనంలా నిలుస్తోందని వైయస్సార్‌సీపీ ఆక్షేపించింది. చివరకు స్కూళ్లు, క్లాస్‌రూమ్స్‌లో కూడా విద్యార్థినిలకు కనీస రక్షణ లేకుండా పోవడం అత్యంత దారుణమని వైయస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం విపక్షంపై కక్ష సాధింపునకు మాత్రమే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పరిమితం కావడంతో, పాలన అనేది లేకుండా పోయిందని, దీంతో నేరం చేసినా తమనేమీ చేయలేరన్న భావన కూడా నేరస్తుల్లో వ్యక్తమవుతోందని వైయస్సార్‌సీపీ నాయకులు గుర్తు చేశారు.
రాప్తాడు ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్న వైయస్సార్‌సీపీ నాయకులు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
వైయస్సార్‌సీపీ నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు డ్రామాలు. ఒట్టి మాటలు.
:తూమాటి మాధవరావు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌.

– రాప్తాడు ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు తనకు రక్తం మరుగుతోందంటూ డ్రామా చేస్తున్నారు. నిజానికి ఆయనకు స్వార్థ రాజకీయం తప్ప ఏమీ పట్టదు. పట్టపగలు స్కూల్‌లో అందరూ ఉండగా, క్లాస్‌రూమ్‌లో పిల్లలందరూ ఉండగా, ఒక విద్యార్థినిపై ఏకంగా రంపంతో దారుణంగా దాడి అత్యంత హేయం. నారా లోకేష్‌ విద్యా మంత్రి అయినప్పటి నుంచి పాఠశాల విద్యా రంగం గతి తప్పింది. మొత్తం విద్య శాఖ భ్రష్టు పట్టింది. కాబట్టి తక్షణమే నారా లోకేష్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి.

మహిళల రక్షణ గాలికొదిలేసిన ప్రభుత్వం.
:పాముల పుష్పశ్రీవాణి. మాజీ డిప్యూటీ సీఎం.

– రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరిగినప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించి, కఠిన చర్యలు తీసుకుని ఉంటే, రాప్తాడు తరహా ఘటనలు జరిగి ఉండేవి కావు. చివరకు స్కూల్‌లో కూడా పిల్లలకు రక్షణ లేకుండా పోవడం దారుణం. మహిళలు, బాలికల రక్షణను వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది.

మంత్రిగా నారా లోకేష్‌ అట్టర్‌ ఫెయిల్‌.
:బండి పుణ్యశీల. వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.

– విద్యా శాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్‌ వైఫల్యానికి రాప్తాడులోని జిల్లా పరిషత్‌ స్కూల్లో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో మహిళలపై జరిగిన దాడులు, హత్యలు సందర్భంలో కఠిన శిక్షలు నిందితులకు విధించి ఉంటే, ఇప్పుడు దుండగుడు ఇంతలా బరితెగించి స్కూల్లోకి దూసుకువచ్చి ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల ముందే దాడి చేయడానికి సాహసించేవాడు కాదు.

చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి.
:గోరంట్ల మాధవ్‌. మాజీ ఎంపీ.

– అనంతపురం జిల్లా రాప్తాడులో క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిపై జరిగిన దారుణ దాడికి సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలి. అందుకే తక్షణమే ముక్కునేలకు రాసి, ఆయన తన పదవికి రాజీనామా చేయాలి.
అలాగే రాష్ట్ర ప్రజలకు, బాలిక తల్లితండ్రులకు క్షమాపణలు చెప్పాలి. మహిళల రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యం అని ఊకదంపుడు మాటు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఎక్కడున్నారు? రాప్తాడు ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదు?.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లే..:
:కాకాణి పూజిత. వైయస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

– ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారి మహిళల హత్యలు, వారిపై దాడులు యథేఛ్ఛగా కొనసాగుతున్నాయి.  కీలకమైన పోలీసు వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న సీఎం చంద్రబాబు, వారిని అరాచకంగా తమ పార్టీ సేవకులుగా వాడుకుంటున్నారు. దీంతో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయింది. అందుకే రాప్తాడు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా మార్చిన చంద్రబాబు.
:ఎ.రవిచంద్ర. వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

– ఏపీలో చివరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు భద్రత లేకుండా పోయింది. సైకోలు, నేరగాళ్ళు యథేచ్ఛగా తరగతి గదిలోకి చొరబడి విద్యార్థినిలపై దాడి చేస్తున్నారు. రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థినిపై ఛెయిన్‌ రంపంతో దాడి చేసి, ముఖాన్ని కోయడం అత్యంత దుర్మార్గమైన చర్య. తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా వదిలేసిన సీఎం చంద్రబాబు, విపక్ష వైయస్సార్‌సీపీపై కక్ష సాధింపు ధోరణితోనే పని చేస్తున్నారు. అందుకే శాంతి భద్రతలు పూర్తిగా దిగజారి, రాష్ట్రం మరో బీహార్‌లా మారింది. రాప్తాడు ఘటనకు నైతిక బాధ్యత వహించి, విద్యా మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం.
:రాధా మాధవి. వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి.

– వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో చివరకు పాఠశాలల్లో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోయింది. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో పసి బిడ్డల నుంచి యువతులు, విద్యార్థినులు, మహిళలకు ఎవరికీ కూడా భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాాపాడేందుకు చర్యలు తీసుకునే అంశాన్ని విస్మరించి దిగరాజుడు రాజకీయాలు చేయడంలోనే ఈ ప్రభుత్వం మునిగి పోవడంతోనే రాప్తాడు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Back to Top