రేపు పులివెందులలో వైయ‌స్‌ జగన్‌ పర్యటన

 మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న మాజీ ముఖ్యమంత్రి

తాడేపల్లి, అక్టోబర్‌ 31: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (నవంబర్‌ 1) పులివెందులలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకోనున్న ఆయన మున్సిపల్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అదే రోజు సాయంత్రం పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.

Back to Top