కడపలో ఎన్నికల వేళ బయటి వ్యక్తుల మకాం?

సాయిపేటలో ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తుల తరలింపు వెనుక ఉద్దేశంపై అనుమానాలు

వైయస్సార్ జిల్లా: ఎన్నికలకు రెండు రోజుల ముందే కడప నగరంలోని సాయిపేటలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మకాం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్‌ రోజున దాడులు, అల్లర్లు సృష్టించేందుకే వీరిని తరలించినట్లు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నగరంలోని పాలెంపల్లికి చెందిన ఓ నాయకుడి ఆధ్వర్యంలో వారికి వసతి, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు కూడా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్‌కు ముందు అధికారులు సాయిపేటలో పరిస్థితిని పరిశీలించి, ఎన్నికల నియమావళి అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Back to Top