పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై వరుస కేసులు

పోలింగ్‌ రోజు భద్రతపై ఓటర్లలో ఆందోళన

వైయస్సార్ జిల్లా: పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకుని అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, మరోవైపు కీలకమైన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొంటున్నారు.

ఇప్పటికే సుమారు 30 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని, 900 మందికి పైగా కేసుల్లో ఇరికించారని వైయ‌స్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. నామినేషన్ల సమయంలో తమ పార్టీ శ్రేణులపై కాల్పులు జరిగినప్పటికీ, తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని చెబుతోంది. పోలింగ్‌ రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో లేకుండా చేయడమే ఈ కేసుల వెనుక ఉద్దేశమని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పులివెందులలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో టీడీపీకి చెందిన బయటి వ్యక్తులు మకాం వేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేలా ఎన్నికల అధికారులు, పోలీసులు భద్రత కల్పించాలని కోరుతోంది.

Back to Top