అన్నింటా ‘కల్యాణి’దే పైచేయి! 

ప్రచారంలోనే కాదు.. ‘స్మార్ట్‌’స్క్రీన్ల మీదా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణి జోరు
 

విశాఖపట్నం: క్షేత్రస్థాయిలో మైకుల ప్రచార హోరు ముగిసినా, అసలైన సమరం సోషల్‌ మీడియా వేదికగా డిజిటల్‌ స్క్రీన్‌లపై ఇప్పుడు పీక్స్‌కు చేరింది. జీవీఎంసీ ఎన్నికల సమరం.. క్‌లైమాక్స్‌కు చేరుకున్న వేళ.. ప్రచారంలోనే కాదు.. ‘స్మార్ట్‌’స్క్రీన్ల మీదా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అటు ప్రజలతో మమేకమవ్వడంలోనూ.. ఇటు అన్ని వర్గాల నెటిజన్లను ఆకట్టుకోవడంలోనూ టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి కంటే చాలా ముందంజలో ఉన్నారు. 

‘ట్రెండ్‌’సెట్‌ చేస్తున్నారు 
జీవీఎంసీ మేయర్‌ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణి ప్రచార శైలి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్లిక్‌మనిపిస్తే చాలు ఆమె ప్రచార దశ్యాలు, ప్రజలతో మమేకమవుతున్న రీల్స్‌.. మొబైల్‌ ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాయి. కేవలం ఒక వైపు ప్రచారానికే పరిమితం కాకుండా, ఓటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ, అందరితో కలుపుగోలుగా దూసుకుపోతూ డిజిటల్‌ వేదికలపై నయా ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. 

మేనిఫెస్టో హల్‌చల్‌ 
ఎన్నికల వ్యూహంలో అత్యంత కీలకమైన మేనిఫెస్టో అ్రస్తాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ, ప్రతి వర్గానికి చేర్చడంలో వరుదు కల్యాణి టీమ్‌ పూర్తి సక్సెస్‌ అయింది. ఆమెకున్న స్పష్టమైన వాక్చాతుర్యం, స్థానిక సమస్యలపై ఉన్న పట్టు డిజిటల్‌ ప్రచారానికి భారీ మైలేజ్‌ తెచ్చిపెట్టాయి. ఇన్‌స్ట్రాగాం, ఫేస్‌బుక్, ఎక్స్‌(ట్విటర్‌) వేదికలపై ఆమె షేర్‌ చేస్తున్న పోస్టులు, వీడియోలకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఓటర్ల నాడి ఎటువైపు ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.  

టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణితో పోల్చి చూస్తే సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌లో వరుదు కల్యాణిదే స్పష్టమైన పైచేయి. ఇన్‌స్ట్రాగాంలో 64 వేలకు పైగా, ఫేస్‌బుక్‌లో 78 వేల మందికి పైగా ఫాలోవర్లతో కల్యాణి సుడిగాలి వేగంతో దూసుకుపోతుండగా, శ్రావణి ఫేస్‌బుక్‌లో 5,700, ఇన్‌స్ట్రాగాంలో 6,232 మంది ఫాలోవర్లకే పరిమితమై గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు. సాంప్రదాయ ప్రచారానికే పరిమితమైన ప్రత్యర్థి క్యాంప్‌తో పోలిస్తే, సరికొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజిటల్‌ వార్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మేయర్‌ రేసులో వరుదు కల్యాణి అత్యంత వేగంగా ప్రజల మద్దతుని కూడగట్టుకోవడం విశేషం.  

Back to Top