ఇస్రో శాస్త్రవేత్తలకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు 

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైయ‌స్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా.. ‘ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు హృదయపూర్వక అభినందనలు.

స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ బలోపేతంలో ఈ ప్రయోగం కీలక మైలురాయి. అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలో దేశ స్వావలంబనను మరింత బలోపేతం చేసే విజయం ఇది. ప్రజలకు కీలక సేవలు అందించడంలో ఈ ఉపగ్రహం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, మేధస్సు, నిరంతర కృషి దేశానికే గర్వకారణం’ అని పోస్టు చేశారు.

Back to Top