స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం ఖాయం

: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అన్నమయ్య జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయంపై ధీమా వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు మందగించడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి గ్రామాలకు దూరంగా ఉంచినా, బెదిరింపులకు పాల్పడినా ఎన్నికల్లో ప్రజలు పాల్గొంటారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top