తాడేపల్లి: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే రంపంతో జరిగిన దాడి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలోకి దుండగుడు స్వేచ్ఛగా ప్రవేశించి బాలికపై దారుణంగా దాడి చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం మరింత విషాదకరమన్నారు. విద్యార్థినులకు తక్షణ వైద్యం.. నిందితుడికి కఠిన శిక్ష గాయపడిన విద్యార్థినులకు అత్యుత్తమ అత్యవసర వైద్యం అందించాలని, వారి కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించాలని వైయస్ జగన్ కోరారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, పారదర్శక విచారణ ద్వారా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భద్రతపై సమీక్షించాలి రాజకీయ కక్షలు, రెడ్‌బుక్ పాలనకు ప్రాధాన్యం ఇస్తూ పిల్లల భద్రతను విస్మరిస్తే నేరగాళ్లకు భయం లేకుండా పోతుందని వైయస్ జగన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల భద్రతా ఏర్పాట్లపై తక్షణ సమీక్ష చేపట్టాలని, ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని కోరారు.