చిత్తూరు జిల్లా: చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పెనుమూరు మండలంలోని కలికిరి పంచాయతీ మొరవకండ్రిగ హరిజనవాడకు చెందిన 35 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరాయి. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు సాదరంగా స్వాగతం పలికారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.