తిరువూరులో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార జోరు

ప్రజల ఆదరణే మా బలం: పరసా శ్రీనివాసరావు

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు, మూడో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి చిట్టిపోతుల లక్ష్మీనారాయణకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుని వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరువూరు పట్టణంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పరసా శ్రీనివాసరావు గుర్తుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ప్రజలు తనను ఆప్యాయంగా పలకరిస్తూ “బీరువాల బాబు మావాడు” అంటూ చూపిస్తున్న అభిమానమే తనకు కొండంత బలమని పరసా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, తిరువూరు పట్టణం మరింత అభివృద్ధి చెందాలన్నా ప్రజల మద్దతు అవసరమని చెబుతూ, మూడో వార్డు అభ్యర్థి చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, 11వ వార్డు అభ్యర్థి రామవరపు ప్రసాద్‌తో పాటు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను తమ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని పరసా శ్రీనివాసరావు ఓటర్లను కోరారు.

Back to Top