చెన్నై: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చెన్నైలో వైయస్‌ఆర్‌సీపీ తమిళనాడు రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ తమిళనాడు అధ్యక్షుడు హుస్సేన్ నాయకత్వంలో ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మహానేత వైయస్‌ఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెరంబూర్‌లోని డాన్‌బాస్కో పాఠశాలలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో అల్పాహారం పంపిణీ చేశారు. వృద్ధులతో కలిసి సమయం గడుపుతూ వారికి ఆహారం అందించారు. వైయస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా హుస్సేన్ పేర్కొన్నారు. చెన్నైలోని వైయస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద కూడా సేవా కార్యక్రమం నిర్వహించారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, పార్టీ కార్యకర్తలకు బిర్యానీతో కూడిన భోజనం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం సవీతా కాలేజీలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైయస్‌ఆర్ ప్రజల కోసం చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రకాశ్, మణివణ్ణన్, కృతీ, సంపత్, భాస్కర్, సాధిక్, శరవణన్, సతీష్, మీనాక్షి, జయంతి, దీప, శుభ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన వైయస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు స్థానికులు, ఏపీ ప్రజలు పాల్గొన్నారు.