విజయవాడలో వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి ఘన నివాళులు

పోలవరం ప్రాజెక్ట్‌ నీళ్లతో వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి అభిషేకం చేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా విజయవాడ కంట్రోల్‌ రూమ్‌ వద్ద వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పోలవరం ప్రాజెక్ట్‌ నీళ్లతో అభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సాగునీటి ప్రాజెక్టులకు వైయ‌స్‌ఆర్‌ పునాది

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న, రూపుదిద్దుకున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో అనేక వాటికి వైయ‌స్‌ఆర్‌ దార్శనికత, సంకల్పమే పునాది అని తెలిపారు. పోలవరం, పులిచింతల, వెలుగొండ వంటి భారీ ప్రాజెక్టులకు వైయ‌స్‌ఆర్‌ హయాంలోనే జలయజ్ఞం కింద శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నాడు జలయజ్ఞాన్ని ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడు, నేడు వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో పూర్తయిన పనులను తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని అన్నారు.

రైతు సంక్షేమానికి వైయ‌స్‌ఆర్‌ పెద్దపీట

రైతులకు నిజమైన మేలు చేసిన ప్రభుత్వాలు డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌, ఆ తర్వాత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలేనని వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైయ‌స్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రకటించినప్పుడు చంద్రబాబు హేళన చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలన ఎప్పుడూ రైతులను మోసగించడానికే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైయ‌స్‌ఆర్‌

పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతుల కోసం ఉచిత విద్యుత్‌ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వైయ‌స్‌ఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైయ‌స్‌ఆర్‌ భౌతికంగా దూరమై 17 ఏళ్లు గడిచినా నేటికీ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని తెలిపారు. వైయ‌స్‌ఆర్‌ ఆశయాలను వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Back to Top