బొల్లా బ్రహ్మనాయుడిని పరామర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 పల్నాడు జిల్లా: నరసరావుపేటలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే  బొల్లా బ్రహ్మనాయుడు ను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , కాసు మహేష్‌రెడ్డి , పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ పరిశీలకుడు  పునూరి గౌతమ్‌రెడ్డి , సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి కలిసి ఆయనను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు బొల్లా బ్రహ్మనాయుడికి ధైర్యం చెబుతూ, పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం.
 

Back to Top