తాడేపల్లి: గురు పూజోత్సవం సందర్భంగా డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అనర్హులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్‌బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్‌కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. అనర్హులు పాఠాలు చెబితే పిల్లల భవిష్యత్తు ఏంటి?: వైవీ సుబ్బారెడ్డి డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అనర్హులు కూడా ఉపాధ్యాయులుగా మారారు. అనర్హులు పాఠాలు చెబితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అర్హత లేని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అర్హతతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే గుర్తించి తొలగించాలి. పూర్తిస్థాయిలో ధ్రువీకరణ చేపడితే అనర్హులు బయటపడతారు. సీబీఐ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయానికి గురైన వారికి న్యాయం జరుగుతుంది. నకిలీ గురువులతో భావితరాలకు నష్టం: కురసాల కన్నబాబు అనర్హులు గురువులుగా మారితే విద్యార్థులే నష్టపోతారు. విద్యావ్యవస్థలోకి నకిలీ గురువులను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. నకిలీ గురువులతో భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన కుంభకోణంగా మారింది. అక్రమాలు వెలుగులోకి వచ్చినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం నష్టం చేసింది. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం, అనర్హుల ఏరివేత, అక్రమాలకు బాధ్యులపై చర్యలు జరిగే వరకు పోరాటం ఆగదనే స్పష్టమైన సందేశాన్ని నిరసన దీక్ష ద్వారా వైయస్ఆర్‌సీపీ ఇచ్చింది.