సభ్యసమాజం తలదించుకునేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు

మాజీ మేయర్ మహమ్మద్ వసీం

అనంతపురం: అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి,మాజీ ఎంపీ తలారి రంగయ్య,మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు.జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ మేయర్ మహమ్మద్ వసీం ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు  మల్లెమీద నరసింహులు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్ లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మహమ్మద్ వసీం  మాట్లాడుతూ రెండేళ్ల కూటమి ప్రభుత్వ  పాలనలో అరాచకాలు,దౌర్జన్యాలపై ప్రతిపక్ష పార్టీగావైయ‌స్ఆర్‌సీపీ నేతలు  ప్రశ్నింస్తుంటే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని,ఇదేనా ఆయన సంస్కారం అని ప్రశ్నించారు. జిల్లాలో ఎమ్మెల్యేలుగా,ఎంపీలు గా ఎందరికో రాజకీయంగా అవకాశం దక్కిందని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం కేవలం అనంత వెంకటరామిరెడ్డి టార్గెట్ గా ఏమి చేశావని మాట్లాడుతున్నారన్నారు.ఎంపీగా అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నగర ప్రజలకు పీఏబిఆర్ నుండి త్రాగునీరు అందించే పథకం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు.అదే విధంగా ఎమ్మెల్యేగా 18 నెలల కాలంలోనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు 4 వరసల రహదారి నిర్మాణం, అర్బన్ హెల్త్ సెంటర్ ల నిర్మాణం,25 కోట్ల స్పెషల్ గ్రాంట్ మంజూరు తోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారని,నగర ప్రజలకు ఐదేళ్ళ పాలనలో జరిగిన అభిరుద్ది తెలుసునన్నారు.జిల్లాలో  అనంత కుటుంబానికి 50 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉందని,నాటి నుంచి ప్రజలు ఆదరిస్తున్నారని,అలాంటి కుటుంబీకులను అసభ్య పదజాలంతో దూషిస్తావా అని ఆయన మండిపడ్డారు.జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్యం లో ఉన్నామన్నది మరచిపోయారా అని అలాంటి భాష తాడిపత్రి లో చెల్లుతుందేమో కానీ అనంతపురం లో చెల్లదని గుర్తించాలన్నారు.అదే విధంగా ముస్లిం మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  నాకు మేయర్ గా అవకాశం కల్పించారని,తమది కూడా రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబమేనని,కానీ గాలి మాటలు విని  నేను 2,3 కోట్లు ఇచ్చి మేయర్ పదవి పొందినట్లు మాట్లాడారని నేను ఇచ్చినట్లు నీవు చూశావా,నీవు చెప్పిన అతను చూశారా అని ప్రశ్నించారు. అదే విధంగా  ఒక్కో బిల్డింగ్ లో 4,5 లక్షలు తీసుకున్నట్లు మాట్లాడారని నేను తీసుకున్నది నీవు చూశావా,ఒక వేల నీకు చెప్పిన అతను తీసుకున్నారేమో నాకు తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి మీ తాడిపత్రి లో సంస్కృతి ఉందేమో కానీ ఇక్కడ లేదని ఆయన పేర్కొన్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పెట్టె నాయకుడు మీ వద్ద మార్కుల కోసం చెప్పుడు మాటలు చెపుతుంటారని అతని నైజం కూడా మీకు తెలుసునన్నారు.అదే నేత ఇక్కడ కూడా అధికార నేతలకు తప్పుడు సలహాలు ఇచ్చారని,మొదట్లో వారు నమ్మినా నిజం తెలుసుకుని దూరం పెట్టారని ,అలాంటి గాలి మాటలు నమ్మి మీరు నవ్వులపాలు కావొద్దని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాలలో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలపై   పోరాటాలు జరుతుంటాయని జిల్లా అధ్యక్షులుగా అనంత వెంకటరామిరెడ్డి నిర్వహించే కార్యక్రమాలలో సమన్వయ కర్తగా పెద్దారెడ్డి ఉంటే అతని పక్కన కూర్చుకోకూడదు అనేకి నీవు రాచరిక పాలనలో ఉన్నావా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జేసీ ప్రభాకర్ రెడ్డి భాష తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. 

ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి ని ప్రజలే ఛీకొట్టే రోజులు దగ్గర లోనే ఉన్నాయని హెచ్చరించారు.రాజకీయాలు కాకుండా వ్యక్తి దూషణ చేస్తున్నారని మరో కే ఏ పాల్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి  తయారు అవుతున్నారని ఎద్దేవాచేశారు.తాడిపత్రి రెండేళ్ల లో చేసింది ఏమి లేక  చేసేకి ఏమి లేక అనంతపురం వచ్చి  డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.గతంలో సినీనటి మీద అసభ్యకరంగా మాట్లాడి క్షమాపణ చెప్పింది వాస్తవం కాదా,అడిషనల్ ఎస్పీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.అనంతపురం నగరంలో  రూ.1300 కోట్లతో అభిరుద్ది చేసిన ఘనత అనంత వెంకటరామిరెడ్డి కి మాత్రమే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ 3 తరాల రాజకీయ అనుభవము ఉన్న జేసీ కుటుంభం ఎంతో హుందాగా ఉండాలని కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో ఆ కుటుంభం పరువు తీస్తున్నారన్నారు.తాడిపత్రి లో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా నడుస్తోందా అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా మీరు కార్యక్రమాలు చేయలేదా అని ప్రశ్నించారు.అనంతపురం లో మౌలిక సదుపాయాలు మార్పు వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే సాధ్యమైందని,మేము ఏమి చేశామో ప్రజలకు తెలుసు జేసీ ప్రభాకర్ రెడ్డి  సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. జిల్లా అధ్యక్షులుగా పార్టీ పటిష్టత కోసం పని చేయాల్సిన బాధ్యత అనంత వెంకటరామిరెడ్డి పై ఉందన్నారు.ఇప్పటికైనా జేసీ ప్రభాకర్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఆయన సూచించారు.సమావేశంలో య‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాజీ కార్పొరేటర్లు శ్రీనివాసులు,ఇషాక్,కమల్ భూషణ్,నాయకులు కుళ్ళాయి స్వామి,కాకర్ల శీనా,అబ్బాస్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top