ప్రొద్దుటూరులో వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీ చేరికలు

టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో 200 కుటుంబాలు.. 

కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

వైయ‌స్ఆర్‌ జిల్లా: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతానగర్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వారికి వైయ‌స్ఆర్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమృతానగర్‌లో పెద్ద సంఖ్యలో కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతుందని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

Back to Top