ప్రజల మధ్యే.. ప్రజల సమస్యలే లక్ష్యంగా మిథున్‌రెడ్డి పాదయాత్ర

 సదుంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం.. ప్రజలతో మమేకమై సమస్యలపై ఆరా

చిత్తూరు: సదుం మండలంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఎంపీ  పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం సదుం పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్రగా సాగారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమైన ఎంపీ మిథున్‌రెడ్డి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓపికగా విని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తమ సమస్యలను స్వయంగా విని భరోసా ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Back to Top