ప్రకాశం జిల్లా: అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిని అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలగూడ అశోక్ కుమార్ పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్న తీరు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే చిన్న బిడ్డల తల్లులతో మాట్లాడిన డాక్టర్ చింతలగూడ అశోక్ కుమార్ ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం, అవసరమైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.