క్లోరోక్విన్ బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

గిరిజన ప్రాంతాల్లో వరుస విషాదాలపై కూటమి ప్రభుత్వం స్పందించాలి

 బాధితులకు మెరుగైన వైద్యం అందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

 పోలవరం జిల్లా:  రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ గుల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకుని తీవ్ర అస్వస్థతకు గురై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూనవరం మండలం కోతులగుట్టలో విద్యార్థిని తెల్లం జాహ్నవి మలేరియాతో మృతి చెందిన ఘటన మరువకముందే ఎటపాక మండలం గుల్లగుప్ప గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. గిరిజన పాఠశాలల్లో వరుస మరణాలు, అనారోగ్య ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం, గిరిజన సంక్షేమ మంత్రి స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. గిరిజనులపై కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఈ ఘటనలతోనే అర్థమవుతోందన్నారు.

క్లోరోక్విన్ బాధితులకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని నాగులపల్లి ధనలక్ష్మి కోరారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆకుల వెంకట రామారావు, ఎంపీపీ కాకా కామేశ్వరి వెంకటేష్, జడ్పీటీసీ ఉబ్బ సుష్మిత, రాష్ట్ర కార్యదర్శి కుర్నాల బుజ్జి, పురుషోత్తపట్నం ఎంపీటీసీ రామిరెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దామెర్ల రేవతి, మండల మహిళా అధ్యక్షురాలు గుడిమల్ల నాగలక్ష్మి, ముక్క కల్పన, మండల యువజన అధ్యక్షుడు తోట శశికుమార్, మండల రైతు విభాగ అధ్యక్షుడు ధారా రమేష్, విస్సాపురం మాజీ సర్పంచ్ పోడియం లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి ఆకుల దయాకర్, మద్దిబోయిన రాము, పురుషోత్తపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు సారెడ్డి శ్రీనివాసరెడ్డి,   తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top