రాజకీయ వేధింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు

మాజీ మంత్రి విడదల రజిని

 చిలకలూరిపేట: వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టినా, రాజకీయ వేధింపులకు గురిచేసినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని పేర్కొన్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి నాయకుడికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. కేసులు, రాజకీయ వేధింపులతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవడం తమ బాధ్యతని, చిలకలూరిపేట నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇటీవల నమోదైన కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన సింగారెడ్డి కోటిరెడ్డి ఈరోజు బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు విడదల రజిని నివాసానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

May be an image of one or more people, lighting and dais

 ఈ సందర్భంగా సింగారెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ తనపై నమోదైన కేసులకు, ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. మాజీ మంత్రి విడదల రజిని నాయకత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ కోసం, ప్రజల కోసం మరింత పట్టుదలతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ దరియావలి, నాదెండ్ల మండల ఉపాధ్యక్షుడు అల్లాడి రవికుమార్, నాదెండ్ల మండల సీనియర్ ఎస్సీ నాయకుడు కాండ్రు శేషయ్య, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top