తాడేపల్లి: అధర్మంపై ధర్మం, చీకటిపై వెలుగు, చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తాయని చాటిచెప్పే పండుగ విజయదశమి అని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల కష్టాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.