వైయస్ఆర్ కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణగా నిలబడి దగ్గరుండి మరీ నామినేషన్లు వేయించాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ, కొందరి అధికారులు కలిసి ఎంత పరాకాష్టకు, ఎంత నికృష్ట స్థాయికి దిగజార్చారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో ఏజెన్సీ ప్రాంతాలలో, మారుమూల అడవులలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే గొప్ప వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పిస్తుందని, కానీ నేడు చంద్రబాబు కూటమి పాలనలో కనీసం నామినేషన్ కూడా వేయనివ్వని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పంజాబ్, బీహార్ నుంచి గూండాలను తెచ్చారంటూ చంద్రబాబు అవాస్తవాలతో వక్రీకరణలు చేస్తున్నారని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ప్రశ్నించారు. అభ్యర్థులు నామినేషన్ వేసుకునేందుకు ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకోవాల్సిన దుస్థితి వచ్చినందుకు సీఎం చంద్రబాబు, పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. వైయస్ఆర్సీపీఅధినేత వైఎస్ జగన్ గారి పరపతి తగ్గించే కుట్రలలో భాగంగానే ఈ అరాచకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నిత్యం జగన్ గారిపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. ప్రతిపక్ష నేతల నామినేషన్లను అడ్డుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న బాధ్యులైన వారిలో ఒక్కరినైనా ఇప్పటివరకు అరెస్టు చేశారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... జగన్ గారి ప్రజాదరణ తగ్గించి చూపే కుట్రలు: వైఎస్ జగన్ గారి ప్రజాదరణను తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తన ప్రభుత్వ అసమర్థతను, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ గారిపై నిందలు వేస్తున్నారు. కడప జిల్లా నుంచి మొదలుపెట్టి పుంగనూరు మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం, వైయస్ఆర్సీపీఅభ్యర్థులను భయపెట్టడం, నామినేషన్లు వేయకుండా నిరోధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం వెసులుబాటు కల్పించే వ్యవస్థ మనది. అలాంటిది మన రాష్ట్రంలో అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వని పరిస్థితులు కల్పించడం దుర్మార్గం. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన ప్రభుత్వం, వాటిని ఒక ఫార్స్‌గా మార్చడం సిగ్గుచేటు. చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే, ధైర్యముంటే వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం మానేసి, వైయస్ఆర్సీపీ అభ్యర్థులతో ఆయనే దగ్గరుండి నామినేషన్లు వేయించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం ఎందుకు? ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకునే హక్కును కూడా కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఎస్పీనే నామినేషన్లు అడ్డుకున్నారు: పులివెందుల మున్సిపాలిటీలో మొదటి రోజే మా చైర్మన్ అభ్యర్థితో పాటు 22 మంది కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన 18 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్లినప్పుడు పోలీసులు సమయం ఇస్తామని చెప్పి, ఆ తర్వాత మమ్మల్ని కార్యాలయంలోకి వెళ్లనివ్వలేదు. జిల్లా ఎస్పీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమయం ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోకుండా అభ్యర్థులను అడ్డుకోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? నిరసన సమయంలో టియర్ గ్యాస్ ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరపడం వంటి ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. పోలీసులే రాళ్లు విసిరి, తిరిగి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి చేశారంటూ ఆరోపణలు చేయడం, హత్యాయత్నం కేసు నమోదు చేసి 600 నుంచి 700 మందిని నిందితులుగా చేర్చినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వ్యక్తి చేసే పనేనా?: రాయచోటిలో వైయస్ఆర్సీపీ కార్యాలయం వద్ద కార్లపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించిన ఘటనపై కూడా సమగ్ర విచారణ జరగాలి. స్థానికంగా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోకుండా, పంజాబ్, బీహార్ నుంచి గూండాలను తీసుకొచ్చారని చంద్రబాబు వక్రీకరణలు చేయడం ఏమిటి? భద్రత కోసం వచ్చిన సిబ్బంది వివరాలను పరిశీలించి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. టీడీపీ గూండాలు కత్తులు, రాడ్లతో స్వేచ్ఛగా తిరుగుతుంటే..: కడప, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, పల్నాడు, బద్వేలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా దాడులు, బెదిరింపులు, నామినేషన్ల అడ్డగింతకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ వర్గాలు కర్రలు, కత్తులు, రాడ్లతో తిరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుంటే, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం సెక్షన్ 144 పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఎందుకు? ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు సృష్టించిన వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు? బాధ్యులైన వారిలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలి. అభ్యర్థులకు రక్షణ కల్పించి, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా నిర్వహించాలి. చంద్రబాబుకి నిజంగా ప్రజాబలం ఉంటే..: ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చంద్రబాబుకు నిజంగా ప్రజాబలం ఉందని నమ్మకం ఉంటే, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని నామినేషన్లు అడ్డుకోవడం, ప్రతిపక్ష అభ్యర్థులను కేసులతో భయపెట్టడం మానుకోవాలి. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలి. ఎన్నికల అరాచకాలకు పాల్పడినవారిని కాపాడకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రజల తీర్పును స్వేచ్ఛగా వెలువడనివ్వాలని సతీష్ కుమార్ రెడ్డి హితవు పలికారు.