తాడేపల్లి : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోకకంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించిన ఘట్టం చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని వైయస్ జగన్ పేర్కొన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, కనకదుర్గమ్మ దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైయస్ జగన్ కోరుకున్నారు.