బద్వేలులో స్క్రూటినీలోనూ అడ్డంకులు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
 

వైయస్సార్ జిల్లా: బద్వేలు మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్క్రూటినీ ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల తీరుతో పాటు పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవకాశం కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు.
 

Back to Top