ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మున్సిపాలిటీ పరిధిలోని 20, 21వ వార్డుల్లో వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. పాత తిరువూరులోని ముస్లిం బజార్లో జెండాల చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ ప్రచారంలో పాల్గొని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు, 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ నాగులు మీరా, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మర్సకట్ల శ్రావణ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలను కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, తిరువూరు పట్టణ వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు గజ్జల సీతారామయ్య, కలసాని నాగేశ్వరరావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20, 21వ వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారాన్ని కొనసాగించారు.