గన్నవరంలో వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీ చేరికలు

రామచంద్రపురంలో 30 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తల చేరిక

డాక్టర్ వల్లభనేని వంశీ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న టీడీపీ శ్రేణులు

కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో గన్నవరం మండలం సూరంపల్లి పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో టీడీపీకి చెందిన 30 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. టీడీపీ మాజీ వార్డు సభ్యుడు పెద్దపూడి సుధాకర్‌తో పాటు శోభనాద్రి, కిషోర్, రాజారవీంద్ర, వారి అనుచరులు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు సర్నాల రాంబాబు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కాజా సుబ్బారావు, సర్నాల లక్ష్మణ్ రావు, కూరాకుల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ వల్లభనేని వంశీ పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రపురం గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం నియోజకవర్గంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.

Back to Top