మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం!

మాజీ మంత్రి అని కూడా చూడకుండా తోసివేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక

చిలకలూరిపేట: చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారనే నేపథ్యంలో, రజినిని కలవడానికి వచ్చిన యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి, దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని పోలీసులు నివాస గేటు వద్దే అడ్డుకున్నట్లు సమాచారం. తన నివాసంలోకి వస్తున్న తనవారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ, వారిని లోపలికి అనుమతించాలని విడదల రజిని కోరగా, చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక ఆమెను గట్టిగా తోసివేయడంతో కిందపడిపోయారు. అంతటితో ఆగకుండా మరోసారి తోసేందుకు ప్రయత్నించారని, పదునైన అంచు ఉన్న బండవైపు నెట్టేందుకు కూడా యత్నించారు.

ఒక మాజీ మంత్రి పట్ల, ఆమె సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారనే విషయం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన సమయంలో, వారిని అడ్డుకోవడంపై ప్రశ్నించిన నాయకురాలిపైనే దురుసుగా వ్యవహరించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని, ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
 

Back to Top