కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల రాళ్లదాడి!

 20 మంది వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌కు గాయ‌లు 

క‌ర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించివేసేందుకు ప్రయత్నించడంతో టీడీపీ, వైయ‌స్ఆర్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపై కూడా రాళ్లదాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్‌తో పాటు మొత్తం 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన సమయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణగిరి ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలగకుండా, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Back to Top