బ్యాలెట్‌పై బాబుకు నమ్మకం లేదు.. బుల్లెట్లపైనే ఆశలు!

అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం

లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం

స్థానిక ఎన్నికల నామినేషన్లు, స్క్రూట్నీ సంద‌ర్భంగా రాష్ట్రంలో సాగుతున్న అధికార పార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ను  వైయస్సార్‌సీపీ నేత‌లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి, ఎంప్లాయిస్ అండ్ పెన్ష‌న‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, గ్రివెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ యోహాన్ రాజు, బొందిలి విభాగం నాయ‌కుడు న‌రేంద్ర‌సింగ్ త‌దిత‌రులు క‌లిసి ఫిర్యాదు చేశారు.  అనంత‌రం ఎస్ఈసీ కార్యాల‌యం వ‌ద్ద పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.   

రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో నామినేషన్ల అడ్డగింతలు, దాడులకు సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాలను ఎస్ఈసీకి అందజేశాం.

టీడీపీ శ్రేణుల దాడులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు

నామినేషన్‌ కేంద్రాల్లోనే పత్రాలు చించివేత.. పోలీసులే అభ్యర్థుల పత్రాలు లాక్కున్న ఘటనలు.

ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, అవినాష్‌రెడ్డిపై దాడుల వీడియోలను ఎస్ఈసీకి అందజేశాం.

కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ కిడ్నాప్‌.. ఆచూకీపై చర్యలు తీసుకోవాలి.

అక్రమాలు జరిగిన 22 ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియను తిరిగి నిర్వహించాలి లేదా ఎన్నికలను వాయిదా వేయాలి.

సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి. 

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్

విజ‌య‌వాడ‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాల్సిన కూటమి ప్రభుత్వం, అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు బ్యాలెట్‌పై నమ్మకం లేక బుల్లెట్లనే నమ్ముకున్నారని, అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేని ప్రభుత్వం ప్రజల తీర్పును ఎలా గౌరవిస్తుందని నిలదీశారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు, పరిశీలన ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రంతో పాటు వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలను పెన్‌డ్రైవ్‌లో అందజేశారు.
అనంతరం ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
మీడియాతో లేళ్ల అప్పిరెడ్డి ఏమ‌న్నారంటే..  

- 22 ప్రాంతాల్లో అక్రమాలు.. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు

“ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ నామినేషన్ల అడ్డగింతలు, దాడులు, పత్రాల చించివేతకు సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాలను ఎస్ఈసీకి అందజేశాం. ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, వైయ‌స్‌ అవినాష్‌రెడ్డిపై జరిగిన దాడుల దృశ్యాలను కూడా సమర్పించాం. టీడీపీ శ్రేణుల దాడులను పోలీసులు అడ్డుకోకపోగా, కొన్ని చోట్ల పోలీసులే నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కున్నారు. 

- స్క్రూటినీ సమయంలో నామినేషన్ కేంద్రాల్లోనే పత్రాల చించివేత

నంద్యాల జిల్లా ఆత్మకూరు, కనిగిరి నామినేషన్‌ కేంద్రాల్లోనే పత్రాలు చించివేసిన ఘటనలు జరిగాయి. పొద్దుటూరులో దాడులు జరిగాయి. కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌ కిడ్నాప్ చేశారు.  ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, అభ్యర్థులకు న్యాయం చేయాలి. నామినేషన్‌ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని ఎస్ఈసీని కోరాం. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయలేదు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలంటే ప్రతి కేంద్రంలో పర్యవేక్షణ ఉండాలి. అభ్యర్థులకు భద్రత కల్పించి, అక్రమాలకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. 

- ఎస్ఈసీ త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలి

నామినేషన్లను అడ్డుకున్న, దాడులు జరిగిన 22 ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియను తిరిగి నిర్వహించాలా, ఎన్నికలను వాయిదా వేయాలా అనే అంశంపై ఎస్ఈసీ తగిన నిర్ణయం తీసుకోవాలి. తిరుపతి మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ సమర్పించిన బీసీ ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలి. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిబంధనల మేరకే నామినేషన్‌పై నిర్ణయం తీసుకోవాలి. 

- ఎన్నికలు బ్యాలెట్‌తో జరగాలి.. బుల్లెట్లతో కాదు

ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలవాలి. ప్రజలకు చేసిన పనులను వివరించి వారి మద్దతు పొందాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులతో భయపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఎన్నికలు బుల్లెట్లతో కాదు.. బ్యాలెట్‌తో జరగాలి. అధికార బలంతో కాకుండా ప్రజాబలంతో గెలవాలి. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికైనా మేల్కొని నామినేషన్ల అడ్డగింతలు, దాడులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రతి అభ్యర్థికి నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కల్పించి, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని లేళ్ల అప్పిరెడ్డి స్ప‌ష్టం చేశారు. 

Back to Top