ఎమ్మిగ‌నూరులో బీజేపీకి షాక్‌

వైయ‌స్ఆర్‌సీపీలోకి బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బంగి రాజేష్

ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిక

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీకి మరింత బలం చేకూరింది. భారతీయ జనతా యువమోర్చా పట్టణ అధ్యక్షుడు బంగి రాజేష్ బీజేపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ రెడ్డి పార్టీ కండువా కప్పి బంగి రాజేష్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు బంగి రాజేష్ తెలిపారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఎమ్మిగనూరు పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని బంగి రాజేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, జగదీష్, రవి శంకర్, రాజశేఖర్, రాము, నరసింహ రాజు, తులసి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top