అమలాపురం 15వ వార్డు నామినేషన్ల పరిశీలనలో గందరగోళం

టీడీపీ అభ్యర్థి వాహనంపై పెండింగ్‌ చలానా ఉందంటూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఫిర్యాదు

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా:  అమలాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు నామినేషన్ల పరిశీలన సందర్భంగా గందరగోళం చోటుచేసుకుంది. నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. 15వ వార్డు టీడీపీ అభ్యర్థి కారుపై చలానా పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వానికి రూ.1,000 చెల్లించాల్సి ఉందని వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి సంసాని చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన కోరారు.

Back to Top