టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ సమక్షంలో మొగిలిచర్లకు చెందిన పలు కుటుంబాలు పార్టీలో చేరిక

ప్రజాసేవ చేసే ప్రతి ఒక్కరికీ వైయ‌స్ఆర్‌సీపీలో ఆహ్వానం

కందుకూరు: వైయ‌స్ఆర్‌సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి చెందిన పలు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో సొసైటీ సభ్యుడు బండి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీ కోసం, ప్రజాసేవ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ వైయ‌స్ఆర్‌సీపీలో ఎప్పుడూ స్వాగతం ఉంటుందని బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తెలిపారు. పార్టీ అనేది తల్లిలాంటిదని, కార్యకర్తలను అక్కున చేర్చుకుని వారికి తగిన అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి అందరూ ఐక్యంగా పనిచేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

మొగిలిచర్ల గ్రామం నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వారిలో బండి రాజమ్మ, బండి కిషోర్‌రెడ్డి, భీమవరపు సిసింద్రీ, పల్లాల రఘురామిరెడ్డి, వేముల మాలకొండయ్య, వేముల మార్కండేయులు, బాసం కొండలరావు, గోరంట్ల రాజేష్‌, స్వర్ణ రవి, ఇంద్రకంటి యెహోవా, స్వర్ణ ఆమోస్‌, లేటి నాగేష్‌ తదితరులు ఉన్నారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Back to Top