అర్నబ్‌ తుపాన్‌ వల్ల రైతులకు తీవ్ర నష్టం

అయినా ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

వైయస్‌ జగన్‌ ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, అర్నబ్‌ తుపాన్‌ ప్రభావిత జిల్లాల పార్టీ అధ్యక్షులతో విషయాలు ఆరా తీశారు. ఆయా జిల్లాల్లో తుపాన్‌ ప్రభావం, రైతులకు కలిగిన నష్టం, ప్రజలు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వివరాలు తెలుసుకున్న శ్రీ వైయస్‌ జగన్, పార్టీ పరంగా చేపట్టాల్సిన, చేయాల్సిన వాటిపై దిశా నిర్దేశం చేశారు.

ఆర్టీజీఎస్‌లో సమీక్షల పేరుతో చంద్రబాబు డ్రామా

అబద్ధాలు ప్రచారం చేస్తూ కేవలం ఆర్భాటం 

సీసీ కెమెరాల ద్వారా పంట నష్టం అంచనా ఎలా సాధ్యం?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌ 

గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించండి

రైతులు, ప్రజలకు తోడుగా, అండగా నిలబడండి

వారితో ఉన్నామన్న తుపాన్‌ బాధితుల్లో కల్పించండి

తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడండి

పార్టీ నేతలు, నాయకులు, శ్రేణులకు శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపు

పంట నష్టంపై పూటకో లెక్క చెబుతున్న ప్రభుత్వం

ఏమీ చేయకపోయినా అన్నీ చేశామంటూ ప్రచారం

ఉచిత పంటల బీమా లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు

మరోవైపు ఆర్బీకేలు, ఈ–క్రాప్‌ పూర్తిగా నిర్వీర్యం

సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. గిట్టుబాటు ధరలూ లేవు

మొంథా తుపాన్‌ నష్టానికి ఇప్పటికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు

దాదాపు రూ.600 కోట్లు బకాయి పడిన ప్రభుత్వం

:శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌

పెట్టుబడి సాయంలోనూ ప్రభుత్వం దగా

మూడేళ్లకు కలిపి మొత్తం రూ.60 వేలు ఇవ్వాలి

కానీ ఇచ్చింది కేవలం రూ.19 వేలు. బాకీ రూ.41 వేలు

మొన్నటి వరకు కరవు పరిస్థితి. ఇప్పుడు తుపాన్‌ ఎఫెక్ట్‌

అటు, ఇటూ కోలుకోలేక దారుణంగా దెబ్బ తిన్న రైతులు

అయినా ఏ మాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం

:గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

ఈ పరిస్థితుల్లో రైతులు, ప్రజలకు పూర్తి అండగా ఉండాలి

నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయిలో మమేకం కావాలి

ప్రతి అడుగులో రైతులు, ప్రజలకు తోడుగా నిలబడాలి

:వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశం

తాడేపల్లి:అర్బబ్‌ తుపాన్‌ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగినా, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చూపుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఆర్టీజీఎస్‌లో సమీక్షల పేరుతో డ్రామా చేస్తున్న సీఎం చంద్రబాబు, అబద్ధాలు ప్రచారం చేస్తూ కేవలం ఆర్భాటానికే పరిమితం అవుతున్నారని, ఆర్‌టీజీఎస్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పంట నష్టం అంచనా ఎలా సాధ్యం? అని నిలదీశారు. 
    పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలు, రైతులకు తోడుగా, అండగా నిలబడాలని, వారితో ఉన్నామన్న భరోసా కల్పించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
    అర్బన్‌ తుపాన్‌ ప్రభావం, నష్టాలపై వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, ఆ తుపాన్‌ ప్రభావిత జిల్లాల పార్టీ అ«ధ్యక్షులతో విషయాలు ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన, పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

వ్యవస్థలన్నీ దిగజారాయి. దీంతో అంతా డ్రామా:
    అర్బన్‌ తుపాన్‌ ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎక్కడా నష్టం అంచనా జరగలేదు. ఎక్కడా పూర్తిగా సహాయ కార్యక్రమాలు లేవు. విద్యుత్‌ సరఫరా కూడా పునరుద్ధరణ లేదు. వాలంటీర్లు లేకపోవడం వల్ల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఆర్బీకేలు లేవు. ఉచిత పంటల బీమా లేదు. దీంతో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఏమంటున్నారు
    సీసీ కెమెరాల ద్వారా పంట నష్టం అంచనా చేస్తున్నారంట. ఇక్కడ ఆరీటీజీఎస్‌లో కూర్చుని మానిటర్‌ చేస్తే సరిపోతుందా? మరోవైపు పంట నష్టాలపై ఇష్టానుసారం లెక్కలు చెబుతున్నారు. ఒకసారి వరి పంట 1.70 లక్షల ఎకరాల్లోనూ, ఉద్యాన పంటలు 24 వేల ఎకరాల్లోనూ నష్టపోయాయని చెబుతారు. మళ్లీ సాయంత్రానికి ఆ లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఎక్కడా సీరియస్‌నెస్‌ లేదు.

నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారు:
    ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 12 లక్షల ఎకరాల్లో తీవ్ర నష్టం జరిగింది. కోనసీమ, ఉభయ గోదావరి, అనకాపల్లి జిల్లాల్లో వరి పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. వరి పంట ఇప్పుడు పొట్టకొచ్చింది. తుపాన్‌ వల్ల పంటలు మునిగిపోగా, రైతులకు చాలా నష్టం కలుగుతోంది. ఉచిత పంటల బీమా లేక నష్టం మరింత ఎక్కువైంది. ఇంకా కొబ్బరి, అరటి.. ఆక్వాకు చాలా నష్టం కలిగింది. ఏరియేటర్లు నడవక ఆక్వా పంట దెబ్బ తింది. 
    ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా, నష్టం పెద్దగా జరగలేదని ప్రచారం చేస్తున్నారు. అస్సలు పట్టించుకోవడం లేదు. వరి పంటలో ఎకరాకు రూ.40 వేలు, అరటిపై ఎకరాకు రూ.2 లక్షలు, ఆక్వా ఎకరాకు దాదాపు రూ.45 లక్షల వరకు నష్టపోతున్నా, ప్రభుత్వం చాలా తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోంది.

రైతులను ఆదుకోని కూటమి ప్రభుత్వం:
    గత ఏడాది మొంథా తుపాన్‌ వల్ల కలిగిన నష్టంలో దాదాపు రూ.600 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటికీ, ఇంకా ఇవ్వలేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఉచిత పంటల బీమా లేదు. మొన్నటిదాకా కరవు. ఇప్పుడు తుపాన్‌. రెండింటి వల్ల రైతులకు చాలా నష్టం కలిగింది.
    తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి, అంటే 2024 జూన్‌ నుంచి ఒక్క రూపాయి సాయం చేయలేదు.
    నాడు మన ప్రభుత్వ హయాంలో ఏదైనా సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ తర్వాత పంటకు ఉచిత విత్తనాలు ఇచ్చాం. ఇప్పుడు అది లేదు. అన్నదాత సుఖీభవలో మూడేళ్లలో రూ.60 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.19 వేలు ఇచ్చి, రూ.41 వేలు బకాయి పడ్డారు. ఆర్బీకేలతో పాటు, ఈ–క్రాప్‌ నిర్వీర్యం చేశారు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు.

సిండికేట్‌గా మారి దోపిడి:
    మరో వైపు కేజీ బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు ఉంది.
మొత్తం సిండికేట్‌గా మారి బియ్యం ఎగుమతి చేస్తున్నారు. సీజ్‌ ది షిప్‌ అన్నారు. సీజ్‌ లేదు. షిప్‌ లేదు. నాదెండ్ల మనోహర్‌. చినబాబుకు కమిషన్లు. వ్యాపారం చేసేది పయ్యావుల కేశవ్‌ తదితరులు.
    కృష్ణా, గోదావరి డెల్టాలో పండించిన పంటలు చేతికి రాక, ఇంకా నష్టం జరుగుతోంది. దీంతో బియ్యం ధరలు ఇంకా ఎంత పెరుగుతాయో అన్న భయం అందరిలో ఉంది.

ఇప్పుడు దారుణమైన పాలన.
తుపాన్‌ బాధితుల చేయి పట్టుకుని నడిపించాలి:
    మనం ప్రతి అడుగులో తుపాన్‌ బా«ధితులైన ప్రజలు, రైతులకు అండగా ఉండి, చేయి పట్టుకుని నడిపించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా జోన్‌–1 లో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయినా ప్రతి చోటా మనం ప్రజలు, రైతులకు అండగా నిలబడాలి. రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం కొనిపించే ప్రయత్నం చేయాలి.
    తుపాన్‌ వస్తే ఒక్కరూ చనిపోకూడదు అంటారు. ఇక్కడ 8 మంది చనిపోయినా, చంద్రబాబు మాత్రం అంతా సవ్యంగా ఉందంటాడు. ఆర్‌టీజీఎస్‌లో కూర్చుని సీసీ కెమెరాల్లో చూసి, పంట నష్టం తెలుసుకున్నా అంటాడు. మొత్తం సహాయ కార్యక్రమాలు చూశానంటాడు. అందుకే ఇంత దారుణమైన పాలన గతంలో ఎక్కడా చూడలేదన్న శ్రీ వైయస్‌ జగన్‌.. గ్రామాల్లో రైతులు, ప్రజలకు తోడుగా, అండగా ఉండాలని, ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని దిశా నిర్దేశం చేశారు.

    పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీయస్‌ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్‌ తూమాటి మాధవరావు తదితరులు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి హాజరు కాగా.. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీవీ మిధున్‌రెడ్డి, కురసాల కన్నబాబు. గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు.. పార్టీ జిల్లాల అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి (కోనసీమ), దాడిశెట్టి రాజా (కాకినాడ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (తూర్పు గోదావరి), ముదునూరి ప్రసాదరాజు (పశ్చిమ గోదావరి), బి.ప్రసాద్‌ (అనకాపల్లి), పేర్ని వెంకట్రామయ్య (నాని) (కృష్ణా), మత్స్య విశ్వేశ్వరరాజు (అల్లూరి సీతారామరాజు), పరీక్షిత్‌రాజు (పార్వతీపురం మన్యం), బెల్లాన చంద్రశేఖర్‌ (విజయనగరం), ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం), అంబటి రాంబాబు (గుంటూరు), మేరుగు నాగార్జున (బాపట్ల), దేవినేని అవినాష్‌ (ఎన్టీఆర్‌), కెకె రాజు (విశాఖ) తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
---------------------------- 
 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఆర్న‌బ్‌ తుపాను నష్టం, రైతుల సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేత‌ల నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయా జిల్లాల అధ్య‌క్షులు  ఏమ‌న్నారంటే.. 

- చిర్ల జగ్గిరెడ్డి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు

తుపాను దెబ్బకు కోనసీమ రైతాంగానికి కోలుకోలేని నష్టం

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో తుపాను కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పంటలో 10 శాతం మినహా దాదాపు మొత్తం దెబ్బతింది. 19,500 ఎకరాల్లో అరటి, 6 వేల ఎకరాల్లో ఇతర ఉద్యాన పంటలు నష్టపోగా, 33 వేల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీటిలో మునిగిన పంటను తొలగించేందుకే ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే రైతులకు ఆర్థిక భరోసా లభించేది. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలి.

విద్యుత్‌, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జిల్లాలో సుమారు 16 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగినా సరఫరా పునరుద్ధరణలో వేగం కనిపించడం లేదు. విద్యుత్‌ లేక పలు గ్రామాల్లో తాగునీరు, ఫోన్‌ సిగ్నల్స్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. ఇతర జిల్లాల నుంచి విద్యుత్‌ సిబ్బందిని రప్పించి యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలి. అవసరమైన చోట జనరేటర్లతో నీటి ట్యాంకులను నింపి తాగునీరు అందించాలి. ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు పనిచేయక చేపలు, రొయ్యల సాగుకు నష్టం వాటిల్లకుండా చిన్న ఆక్వా రైతులకు తక్షణ సాయం అందించాలి. తుపాను సమయంలో చెట్టు విరిగి పడి మరణించిన అంతర్వేదికి చెందిన గొల్లు వెంకయ్యమ్మ కుటుంబంతో పాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. పంటలు, కొబ్బరి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఆక్వా సాగుకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి పరిహారం అందించాలి. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే జనరేటర్లతో నీటి ట్యాంకులను నింపుతూ ప్రజలకు సహాయం చేస్తున్నారు.

 -  దాడిశెట్టి రాజా, కాకినాడ జిల్లా

తుపాను బాధితులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం

కాకినాడ జిల్లాలో తుపాను బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు హడావుడి చేస్తూ ప్రచారానికే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదు. జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిని నేలవాలిపోయింది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో తుపాన్లు వంటి విపత్తులు వచ్చినప్పుడు చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇప్పుడు కూడా దెబ్బతిన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి, పంట నష్టాలను వెంటనే అంచనా వేసి పరిహారం అందించాలి. ధాన్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు నిల్వలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా ప్రభుత్వం నిఘా పెట్టాలి.

మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలి

తుపాను కారణంగా కాకినాడ జిల్లాలో సుమారు 82 పడవలు పాక్షికంగా దెబ్బతినగా, వందలాది వలలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పడవలు, వలలే మత్స్యకారుల జీవనాధారం. వాటికి జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తక్షణ పరిహారం అందించాలి. రైతులు, మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలి. తుపాను బాధితులకు న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలి.

-  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు

తుపానుతో వరి, అరటి పంటలకు తీవ్ర నష్టం

తూర్పు గోదావరి జిల్లాలో గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం, అనపర్తి, రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గాల్లో తుపాను ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా వరి పంట నేలవాలిపోవడంతో కోతలు కోయడం రైతులకు కష్టంగా మారింది. గోపాలపురం ప్రాంతంలో అరటి పంటకు, రాజానగరం పరిసరాల్లో వరి, అరటి పంటలతో పాటు కొంత మేర పొగాకు పంటకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలి.

విద్యుత్‌, తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి

జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తున్న పరిస్థితి ఉంది. విద్యుత్‌ అంతరాయంతో తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా జనరేటర్లు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పేవి. పునరావాస కేంద్రాలను పరిమిత ప్రాంతాలకే పరిమితం చేయకుండా, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనూ తగిన సౌకర్యాలు కల్పించాలి. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, పంటల బీమా వ్యవస్థల ప్రాధాన్యం ఇప్పుడు స్పష్టమవుతోంది. పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు బీమా భరోసా లేకుండా పోయింది. పంట నష్టాల అంచనాను పారదర్శకంగా చేపట్టి పరిహారం అందించడంతో పాటు విద్యుత్‌, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

- ముదునూరి ప్రసాద్‌రాజు, పశ్చిమ గోదావరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు

తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నష్టం

తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.40 లక్షల ఎకరాల్లో పంటలు, 12 వేల ఎకరాల్లో కొబ్బరి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కంటే బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకొరిగి, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పంటలు, ఆక్వా రంగానికి భారీ నష్టం వాటిల్లింది. పంట నష్టాలను తక్షణమే అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలి.

విద్యుత్‌ అంతరాయంతో ఆక్వా రైతులకు కష్టాలు

జిల్లావ్యాప్తంగా సుమారు 8,500 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని, మా ప్రాంతంలోనే దాదాపు 6 వేల స్తంభాలు పడిపోయాయని అంచనా. విద్యుత్‌ లేక ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు పనిచేయక ఆక్సిజన్‌ సమస్యలు ఏర్పడ్డాయి. జనరేటర్లు ఉన్నా అన్ని చోట్లా ఏరియేటర్లను నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టభయంతో ఉన్నారు. నరసాపురం, భీమవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 28 పునరావాస కేంద్రాల్లోనూ విద్యుత్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గ్రామాల మధ్య రహదారులపై పడిన చెట్లను తొలగించి, విద్యుత్‌, தాగునీటి సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గత మూడు రోజులుగా చెట్ల తొలగింపు, పునరావాస కేంద్రాల్లో భోజనాల పంపిణీ వంటి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులు, మత్స్యకారులు, ఆక్వా రైతులకు జరిగిన నష్టానికి తగిన పరిహారం అందించాలి.

- గుడివాడ అమర్‌నాథ్‌, ప్రాంతీయ సమన్వయకర్త

తుపానుతో 3,500 హెక్టార్లలో వరి పంట నేలపాలు

తుపాను ప్రభావంతో సుమారు 3,500 హెక్టార్లలో వరి పంట బలమైన గాలులకు నేలకొరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం నేలవాలిన వరి పంట తిరిగి కోతకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చెరకు పంటకు పెద్దగా నష్టం జరగకపోయినా, జీడిమామిడి, అరటి వంటి వాణిజ్య పంటలు సుమారు 35 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలి.

విద్యుత్‌, రహదారుల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలి

తుపాను కారణంగా సుమారు 150 నుంచి 170 ట్రాన్స్‌ఫార్మర్లకు అంతరాయం ఏర్పడి గత రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా సమస్యలు కొనసాగుతున్నాయి. సుమారు 36 మిల్లీమీటర్ల వర్షపాతంతో రహదారులు, ప్రధాన కల్వర్టులు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. విద్యుత్‌, తాగునీటి సరఫరాను పునరుద్ధరించి, దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేయాలి. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, బాధితులకు అండగా నిలవాలి.

- పేర్ని నాని, కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు

తుపాను గాలులకు అరటి, వరి పంటలకు నష్టం

తుపాను సమయంలో వర్షాల కంటే బలమైన గాలుల ప్రభావమే ఎక్కువగా కనిపించింది. విద్యుత్‌ స్తంభాలు భారీగా దెబ్బతిన్నాయి. తోట్లవల్లూరు, మోగుదేవి, అందికట్ల మండలాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది. గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లోనూ పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయాలి. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలి.

విద్యుత్‌ పునరుద్ధరణలో జాప్యం.. ఆక్వా రైతులకు ఆక్సిజన్‌ కష్టాలు

మచిలీపట్నం నగరంతో పాటు పెడన నియోజకవర్గం, మచిలీపట్నం ఉత్తర మండలాల్లో విద్యుత్‌ సరఫరా ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. కొన్ని ప్రాంతాలు రెండు రోజులుగా చీకట్లోనే ఉన్నాయి. విద్యుత్‌ అంతరాయంతో తాగునీటి సరఫరా సహా నిత్యావసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, తీగలను వెంటనే మరమ్మతు చేసి సరఫరాను పునరుద్ధరించాలి. విద్యుత్‌ లేక ఆక్వా చెరువుల్లో ఏరియేటర్ల నిర్వహణ కష్టంగా మారింది. జనరేటర్లతో కొన్ని గంటలపాటు మాత్రమే ఏరియేటర్లను నడపగలుగుతున్నారు. నిరంతరం జనరేటర్లను నడపడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆక్వా రైతులకు నష్టం జరగకుండా విద్యుత్‌ సరఫరాను వేగంగా పునరుద్ధరించి, బాధిత రైతులకు సహాయం అందించాలి.

- దేవినేని అవినాష్‌, ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు

మైలవరం నియోజకవర్గంలో వరి పంటకు నష్టం

ఎన్టీఆర్‌ జిల్లాలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసినా, మొత్తంగా పెద్ద స్థాయిలో పంట నష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే మైలవరం నియోజకవర్గంలో వరి పంటకు కొంత నష్టం వాటిల్లింది. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పెద్దగా పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయం అందించాలి.

విద్యుత్‌ అంతరాయాలు.. కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు

విజయవాడ నగరంలో విద్యుత్‌ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల నేల జారిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వర్షం కురుస్తున్న సమయంలోనూ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి.
 
- కేకే రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు

వైయస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో కేకే రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, పాత ఓటర్ల జాబితాల్లోని డూప్లికేట్‌, మరణించిన ఓటర్ల పేర్లతో అక్రమ ఓటింగ్‌ జరగకుండా ఏఎస్‌డీడీ జాబితాలను ఇంటింటికీ పరిశీలించి, బూత్‌ ఏజెంట్లను అప్రమత్తం చేశామని తెలిపారు. సమర్థంగా పనిచేసే బూత్‌ ఏజెంట్లను ఆధారాలు లేకుండా పోలీస్‌ స్టేషన్లకు తరలించడంపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, ఎన్నికల అక్రమాలపై ఆధారాలు సేకరించి ఎస్‌ఈసీకి, అవసరమైతే హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు తుపాను ముందస్తు హెచ్చరికలు, సహాయక చర్యల్లో లోపాల వల్ల విశాఖ జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌లో పడవలు దెబ్బతినడంతో పాటు, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో వరి పంటకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. విద్యుత్‌, ఇంటర్నెట్‌ అంతరాయాలు, కొండవాలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడగా, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆహార పొట్లాలు అందించి తుపాను బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. 
 
-  బెల్లాన చంద్రశేఖర్‌, విజయనగరం జిల్లా అధ్యక్షుడు

 మన అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఆన్‌లైన్‌లో వివరాలు కనిపిస్తున్నప్పటికీ నామినేషన్‌ను తిరస్కరించడంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టు ఆదేశాలు జారీ చేసి, కలెక్టర్‌కు ఆదేశాల ప్రతిని పంపించింది. సంబంధిత అభ్యర్థి పేరును చేర్చి, నామినేషన్‌ను ఆమోదించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్‌కు తెలియజేశాం. ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నామినేషన్‌ తిరస్కరణకు సంబంధించిన రిట్‌ పిటిషన్‌ నంబర్‌, ఇతర వివరాలను మనోహర్‌రెడ్డి గారికి వెంటనే పంపిస్తాను. కోర్టు ఆదేశాల అమలులో ఆలస్యం జరగకుండా ఈరోజే చర్యలు తీసుకోవాలి. బీసీ సర్టిఫికెట్‌కు సంబంధించిన అంశంపై కూడా కోర్టును ఆశ్రయించాం. అవసరమైన వివరాలను పంపిస్తాం. ఈ అంశంపై తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత పత్రాలను వెంటనే అందజేస్తాం.

Back to Top