తాడేపల్లి: ఆసియన్ పారా గేమ్స్‌లో మహిళల 1500 మీటర్ల టీ11 విభాగంలో కాంస్య పతకం సాధించిన రాణి వలసనైనికి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాణి వలసనైని సాధించిన విజయం అంకితభావానికి, పట్టుదలకు, ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయని స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ఘనత ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాణి విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ, తమ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తుందని ఆకాంక్షించారు.