చిత్తూరు: నగరి మున్సిపల్ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించడంపై మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకురాలు ఆర్‌కే రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చిత్తూరు జిల్లా జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని సస్పెండ్ చేయాలని రోజా కోరారు. ఈ వ్యవహారంపై బాలకృష్ణన్ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కాపీని కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిపారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫారం-4లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పేరును చేర్చాలని, ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆర్‌కే రోజా కోరారు.